స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 0.75 శాతం పెరగ్గా, డౌజోన్స్ 0.56 శాతం పెరిగింది. డాలర్ రాత్రి బాగా బలహీనపడింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.చైనా మార్కెట్లు అన్నీ రెడ్‌లో ఉన్నా నష్టాలు పెద్దగా లేవు. నామమాత్రమే. ఇక నిక్కీ గ్రీన్‌లో ఉన్నా నామమాత్రమే. కీలకమైన హాంగ్‌సెంగ్ మాత్రం ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి 20 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా స్థిరంగా స్వల్ప లాభంతో ప్రారంభం కావొచ్చు.