స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న యూరో, రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లలో డౌజోన్స్ ఒకటిన్నర శాతం లాభంతో ముగియడం విశేషం. మిగిలిన ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ సూచీలు కూడా ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ ఏకంగా రెండు శాతం లాభంతో ఉండగా. చైనా A50 సూచీ కూడా ఒకటిన్నర శాతం లాభంతో ఉంది. అయితే మిగిలిన మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌లో కూడా పెద్దలాభాలు లేవు. స్థిరంగా ఉన్నాయని చెప్పొచ్చు. సింగపూర్ నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా…లాభాలు మాత్రం పెద్దగా లేవు. ఈ లెక్కన నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.