నిఫ్ఠికి Q2 బలాన్ని ఇస్తాయా?
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. క్రూడ్ ధరలు చూడ్డానికి స్థిరంగా కన్పిస్తున్నా… ఏ క్షణమైనా పెరిగే ఛాన్స్ ఉంది. సౌదీపై హౌతీలు చేస్తున్న దాడులు గల్ఫ్ దేశాలను డిఫెన్స్‌లో పడేస్తున్నాయి. హౌతీల పేరుతో ఇరాన్‌పై అమెరికా మళ్ళీ భారీ దాడులు చేస్తుందా అన్న అనుమానం మార్కట్లోఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు అండగా నిలిచే అంశాలు కేవలం ద్వితీయ త్రైమాసిక ఫలితాలు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. డిమార్ట్ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అయితే పలు బ్రోకరేజీ సంస్థలు మాత్రం పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయి. ఇంకా ప్రధాన కంపెనీల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఒక్క అంశంపై మార్కెట్‌కు మద్దతుగా నిలిచే పాజిటివ్ అంశాలు పెద్దగా లేవు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయిని కాపాడేందుకు ఆర్బీఐ నానా తంటాలు పడుతోంది. సీఆర్ఆర్ను 99 శాతానికి పెంచడంతో పాటు ఆయిల్ మార్కెటింగ్ తరఫున డాలర్లు కొనేందుకు కొత్త విండో ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల సమీకరించిన లక్షా పాతికవేల కోట్ల డాలర్లు ఏమయ్యాయని మార్కెట్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పైకి క్రూడ్ ధరలు స్థిరంగా కన్పిస్తున్నా…. స్పాట్ మార్కెట్లో క్రూడ్ ధరలు 130 నుంచి 140 డాలర్లు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐటీ నుంచి వస్తున్న డాలర్లలో ఎలాంటి పెరుగుదల లేదు. మన ఎగుమతులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఎగుమతులు లేకపోగా… దిగుమతులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి కాపాడటం ఆర్బీఐకి పెద్ద టాస్క్‌గా మారింది. ఈ నేపథ్యంలో మార్కెట్ అయోమయంలో ఉంది. ఒక్క న్యూఏజ్ రంగానికి చెందిన షేర్లు మినహా… ఇతర ఏ రంగానికి స్పష్టమైన మద్దతు లేదు. ఫార్మా కూడా ఇపుడు నిలకడగా ఉంటోంది. డేటా సెంటర్లు, అనుబంధ పరిశ్రమల షేర్లకు మాత్రమే ఇపుడు మార్కెట్లో డిమాండ్ ఉంది. వరుస లోయర్ సీలింగ్‌లను ఎదుర్కొన్న ESDS సాఫ్ట్వేర్ కౌంటర్లో ఇపుడు వరుస అప్పర్ సీలింగ్‌లు పడుతున్నాయి. సో…. ఎంపిక చేసిన షేర్లు మినహా… ఇతర రంగాల షేర్లలో జంప్ అనుమానమే.
