మన మార్కెట్లో ఏఐ షేర్ల హవా
ఏఐ రంగానికి చెందిన వివిధ కంపెనీల షేర్లు ఇవాళ మన మార్కెట్లో వెలుగులో ఉన్నాయి. ముఖ్యంగా చిప్, ఏఐ ఇన్ ఫ్రా రంగానికి చెందిన షేర్లు ఆకర్షణీయ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అలాగే ఏఐ రంగానికి పవర్, పవర్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ అందించే షేర్లలో కూడా ఇవాళ ఆసక్తి కనబడుతోంది. ఏఐ రంగానికి చెందిన CSDS సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ షేర్ గత వారం లిస్టయింది. తొలి రోజే 111 శాతం లాభం అందించిన ఈ షేర్ ఇవాళ మరో 20 శాతం (అప్పర్ సీలింగ్) లాభంతో ట్రేడవుతోంది. రూ. 1090 వద్ద కూడా ఎన్ఎస్ఈలో 14 లక్షల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు. ఏఐ రంగంలోకి ఇటీవల ప్రవేశించిన స్టాండర్డ్ ఇంజినీరింగ్ షేర్ ఇవాళ కూడా పటిష్ఠంగా ఉంది. ఈ షేర్లో రూ. 160 ప్రాంతంలో ప్రారంభమైన ర్యాలీ ఇంకా కొనసాగుతోంది. ఈ షేర్ ఇపుడు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 412 వద్ద ట్రేడవుతోంది. మొన్నటి దాకా రూ. 300 దిగువన ఉన్న E2E నెట్వర్క్స్ షేర్ ఇవాళ మరో 4.5 శాతం పెరిగి రూ. 628 వద్ద ట్రేడవుతోంది. నెట్వెబ్ కూడా రూ. 22 లాభంతో రూ. 5215 వద్ద ట్రేడవుతోంది. ఇక ఏఐ రంగానికి పవర్, టెక్నాలజీ అందించే షేర్లు ఇవాళ గ్రీన్లో ఉన్నాయి. సీజీ పవర్, హిటాచి ఎనర్జి, ఎన్రిన్, జీవీ టీ అండ్ డీ, అట్లాంటా ఎలక్ట్రికల్స్ షేర్లు 1.5 శాతం నుంచి 2 శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక మోస్చిప్ టెక్నాలజీస్ కూడా రెండు శాతం లాభంతో రూ.217 వద్ద ట్రేడవుతోంది.
