నేడు నిఫ్టికి విషమ పరీక్ష
నిఫ్టికి క్రూడ్ ఆయిల్ ఓ పీడకలగా మారింది. ఏప్రిల్ తరవాత నిఫ్టి తొలిసారి తన సపోర్ట్ లైన్‌ను పరీక్షించనుంది. 24000 స్థాయిని ఇవాళ నిఫ్టి కాపడుకుంటుందేమో చూడాలి. క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగినందున నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. పైగా ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. నిన్న క్లోజింగ్ సమయంలో CAS ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. అనేక షేర్లు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. MSCIలో మార్పులు దీనికి ఒక కారణంగా మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
MSCIలోకి లెన్స్‌కార్ట్, అదానీ ఎనర్జి, గ్రో, లారస్ ల్యాబ్ షేర్లు రాగా, ఆస్ట్రాల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎస్బీఐ కార్ట్స్ బయటకు వచ్చేశాయి. అయితే నిన్న చివర్లో నిఫ్టి బ్యాంక్ ఇండెక్స్‌లో భారీగా పెరిగింది. ఫెడరల్ బ్యాంక్ అనూహ్యంగా రూ. 12లకు పైగా పెరిగింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా. ఇవాళ మార్కెట్ డల్‌గా ఉన్నా… జీడీపీ వృద్ధి రేటు ఎఫెక్ట్ ఉంటుందా అంటే అనుమానమే. ఎందుకంటే అంతకన్నా ముందు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఇంకా జోరుగా ఉంది. ఇవాళ వచ్చిన డేటా ఆర్బీఐ అంచనాల కన్నా మెరుగ్గా ఉంది అంతే. ఇవాళ నువామా కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ కంపెనీలో వాటా కోసం పలు పీఈలు ప్రయత్నిస్తున్నాయి. TBZ ఇన్వెస్టర్లకు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటాను GRT జువెలర్స్ కొన్నారు. 74.12 శాతం వాటా కోసం రూ. 1033 కోట్లు చెల్లించారు. ఐటీసీ ఇన్ఫోటెక్ లిస్ట్ కానుంది. నిష్పత్తి రేషియా అనుకూలంగా ఉంటే ఇవాళ హ్యాపియస్ట్ మైండ్స్ షేర్ పెరగచ్చు. లేదా డీల్ పూర్తయి… లిస్టింగ్ వరకు ఆగడం మంచిది.
