For Money

Business News

లిస్ట్‌ కానున్న ఐటీసీ ఇన్ఫోటెక్‌

హ్యాపియస్ట్‌ మైండ్స్‌ కంపెనీని ఐటీసీ ఇన్ఫోటెక్‌ టేకోవర్‌ చేయనుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ నమూనాను రెండు కంపెనీల బోర్డులు ఆమోదించాయి. కుదరిన ఒప్పందం మేరకు రెండు విడతలుగా 22.1 శాతం వాటాను ప్రమోటర్ల నుంచి ఐటీసీ ఇన్ఫోటెక్‌ కొనుగోలు చేయనుంది. తరవాత షేర్ల మార్పిడి ద్వారా ఐటీసీ ఇన్ఫోటెక్‌లో హ్యాపియస్ట్‌ మైండ్స్‌ కంపెనీ విలీనం కానుంది. హ్యాపియస్ట్‌ మైండ్స్‌ పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌లో 22.103 శాతం షేర్లను షేర్‌ పర్చేజింగ్‌ అరేంజ్‌మెంట్‌ కొనుగోలు చేయనుంది. తొలుత 1.675 కోట్ల షేర్లను (11 శాతం వాటా) రూ. 653.26 కోట్లకు ఐటీసీ ఇన్ఫోటెక్‌ కొనుగోలు చేస్తుంది. తరవాత 1.691 కోట్ల షేర్లను (11.106 శాతం వాటా)నురూ. 676.46 కోట్లకు కొనుగోలు చేయనుంది. తొలి విడత షేర్లకు రూ. 390, రెండో విడత షేర్లకు రూ. 400 ధర చెల్లిస్తారు. ఆ తరవాత ఐటీసీ ఇన్ఫోటెక్‌లోకలుపుతారు. హ్యాపియస్ట్‌ మైండ్స్‌లో మిగిలిన వాటాకు సమాన ఐటీసీ ఇన్ఫోటెక్‌ షేర్లను కేటాయిస్తారు. హ్యాపియస్ట్‌ మైండ్స్‌లో ఉన్న ప్రతి 81 షేర్లకు 25 ఐటీసీ ఇన్ఫోటెక్‌ షేర్లు కేటాయిస్తారు. తరవాత విలీనం తరవాత హ్యాపియస్ట్‌ మైండ్స్‌ కనుమరుగు అవుతుంది. బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈలలో ఐటీసీ ఇన్ఫోటెక్‌ షేర్లు లిస్ట్‌ అవుతాయి. సూతా, అశోక్‌ సూతా మెడికల్‌ రీసెర్చ్‌ LLPలు కలిసి హ్యాపియస్ట్‌ మైండ్స్‌ ప్రమోటర్లుగా ఉన్నారు. ఈ వార్తతో హ్యాపియస్ట్‌ మైండ్స్‌ షేర్‌ రూ.408 వద్ద ముగిసింది.

Leave a Reply