For Money

Business News

గోల్డ్‌ లోన్‌ బిజినెస్‌లోకి…

పలు రకాల నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌ అందిస్తున్న ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ తాజాగా గోల్డ్‌ లోన్‌ బిజినెస్‌లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే ఇంద్రియా పేరుతో ఈ కంపెనీ జులవరీ బిజినెస్‌ నిర్వహిస్తోంది. వచ్చే మార్చిలోగా దేశ వ్యాప్తంగా 200 నుంచి 300 వరకు గోల్డ్‌ లోన్‌ బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. మూడేళ్ళలోగా 1000 శాఖలకు విస్తరిస్తామని ఈ కంపెని వెల్లడించింది. ఇప్పటికే ఈ కంపెనీ రీటైల్‌, ఎంఎస్‌ఎంఈ రంగంలో భారీ ఎత్తున వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. నిన్న రూ. 395 దిగుకు చేరిన ఈ షేర్‌ ఇవాళ రూ. 406.8ని తాకింది. డే ట్రేడర్స్‌కు ఈ షేర్‌ టార్గెట్‌ రూ. 430గా అనలిస్టులు పేర్కొంటున్నారు. స్టాప్‌లాస్‌ రూ. 398. పొజిషనల్‌ ఇన్వెస్టర్లకు ఈ షేర్‌ టార్గెట్‌ రూ. 480గా పెట్టుకోవచ్చని మోతిలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది.

Leave a Reply