For Money

Business News

జెట్‌ స్పీడ్‌తో ఆయిల్‌

ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌లో టెన్షన్‌ నెలకొంది. ఇరాన్‌ ఆయిల్‌ను కబ్జా చేయడం కోసమే తాము యుద్ధం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో ఆయిల్‌ మార్కెట్‌లో అనిశ్చితి మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 116 డాలర్లను దాటింది. మరోవైపు ఇటీవల కాలంలో WTI క్రూడ్‌ వంద డాలర్లు దాటి 102 డాలర్లకు చేరింది. ఖర్గ్‌ ఐల్యాండ్‌ టార్గెట్‌గా అమెరికా పావులు కదుపుతోంది. ఇప్పటికే అదనపు బలగాలను సమీకరించింది. మరోవైపు అమెరికాను ఇరాన్‌ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయిల్‌ మార్కెట్‌ ధరలు జెట్‌ స్పీడుతో పెరుగుతున్నాయి. మున్ముందు కూడా ఆయిల్ సరఫరాలో కష్టాలు కొనసాగుతాయని, ఇప్పట్లో ఆయిల్‌ సరఫరా మునుపటి స్థాయికి చేరడం కష్టమని తెలుస్తోంది.