For Money

Business News

నష్టాలతో ప్రారంభం?

నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. గిఫ్ట్‌ నిఫ్టి ఇదే సంకేతాలు ఇస్తోంది. ఇపుడు గిఫ్ట్‌నిఫ్టి 50 పాయింట్ల దాకా నష్టంతో ట్రేడవుతోంది. గత శుక్రవారం నిఫ్టి గ్రీన్‌లో ముగిసింది. ఇవాళ ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మాత్రం రెడ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి బలహీనంగా ప్రారంభం కానుంది. ఫలితాలు ప్రకటిస్తున్న షేర్లు మినహా.. మిగిలిన షేర్లు బలహీనంగా ఉన్నాయి. నిఫ్టికి 26000 స్థాయికి చేరడం ఇపుడు ఇంచెం కష్టంగా మారుతోంది. నిఫ్టి గత రెండో రోజుల నుంచి నిఫ్టి ఆ రోజు కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. దీన్ని బట్టి చూస్తే టెక్నికల్‌గా నిఫ్టి బలహీనంగా ఉంది. నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన రీసెర్చ్‌ అనలిస్ట్‌ మాత్రం నిఫ్టి నెగిటివ్‌ సంకేతాలు ఇస్తోందని అంటున్నారు. ఇవాళ ఆయన ఎకనామిక్‌ టైమ్స్‌లో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్ మార్కెట్‌ సంకేతాలు ఇస్తూ నిఫ్టిని 26,250 స్టాప్‌లాస్‌తో అమ్మాలని సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన టార్గెట్‌ రూ. 25,450. గత శుక్రవారం నిఫ్టి 25950 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది పూర్తిగా ఫ్యూచర్స్‌ విభాగంలో ట్రేడ్‌. అంటే నవంబర్‌ నెల మొత్తానికి ఈ కాల్‌ ఇచ్చారు. మరి ఇవాళ ఎలా నిఫ్టి సంకేతాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Reply