For Money

Business News

ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లు బంద్‌

డెరివేటివ్స్‌ మార్కెట్‌కు సంబంధించి సెబీ ఇచ్చిన తాజా ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించాయి స్టాక్‌ఎక్స్ఛేంజీలు. ఇప్పటికే బీఎస్‌ఈ సెన్సెక్స్ మినహా ఇతర వీక్లీ డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌లను ఆపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్‌ఎస్‌ఈ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అంటే నవంబర్‌ 20వ తేదీ నుంచి మూడు వీక్లీ డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. బ్యాంక్‌ నిఫ్టి (BANKNIFTY) వీక్లీ కాంట్రాక్ట్‌ వచ్చే నెల 17వ తేదీ నుంచి నిలిపివేస్తున్నారు. నవంబర్‌ 18వ తేదీ నుంచి మిడ్‌క్యాప్‌ నిఫ్టి (MIDCPNIFTY) వీక్లీ కాంట్రాక్ట్‌లను ఆపేస్తున్నారు. అలాగే ఫిన్‌ నిఫ్టి (FINNIFTY) వీక్లీ కాంట్రాక్ట్‌లను నవంబర్‌ 19వ తేదీ నుంచి ఆపేస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది.

Leave a Reply