రతన్ టాటా పరిస్థితి విషమం?
ప్రముఖ వాణిజ్యవేత్త రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. 86 ఏళ్ళ రతన్ టాటా ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో నిన్నటి నుంచి భిన్న కథనాలు వస్తున్నాయి. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలను రతన్ టాటా ఎదుర్కొంటున్నారని, రొటీన్ వైద్య పరీక్షల కోసం ఆయన హాస్పిటల్‌లో చేరినట్లు ఆయన తరఫున నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. బీపీ బాగా తగ్గడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించినట్లు సమాచారం. తాజా ఆరోగ్య పరిస్థితిపై ఇటు టాటా గ్రూప్‌గాని… అటు హాస్పిటల్ గాని ఇవాళ ఎలాంటి పత్రికా ప్రకటన చేయలేదు.