For Money

Business News

పేటీఎం మనీలో F&O ట్రేడింగ్‌

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ పేటీఎం మనీలో ఇక నుంచి మీరు ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్ చేయొచ్చు. బీఎస్‌ఈ ఎఫ్‌ అండ్‌ ఓ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగంగా మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఒకే యాప్‌లో ఎన్‌ఎస్‌ఈతో పాటు బీఎస్‌ఈ ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్‌ చేయొచ్చని పేటీఎం మనీ పేర్కొంది. ఒకో ట్రేడ్‌కు రూ.20 చొప్పున బ్రోకరేజీ వసూలు చేస్తారు. మార్కెట్‌, లిమిట్‌ ఆర్డర్స్‌తో పాటు స్టాప్‌లాస్‌, ఇంట్రా డే ట్రేడింగ్‌ వంటి సౌకర్యాలు ఈ యాప్‌లో ఉంటాయని పేర్కొంది.