రూ. 2 లక్షల వరకు తగ్గింపు
పండుగల సీజన్ సందర్భంగా టాటా మోటార్స్ తన వాహనాల ధరలను గణనీయంగా తగ్గించింది. అన్ని రకాల వాహనాలపై రాయితీ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. డీజిల్, పెట్రోల్, సీఎన్జీ మోడల్స్‌పై కూడా రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. నెక్సన్, హారియర్ వంటి ప్రధాన బ్రాండ్లపై కూడా రూ. 2.05 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. అలాగే రూ. 45000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. రాయితీల తరవాత ప్రధాన మోడల్స్ ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి.
టియాగొ రూ. 4.99 లక్షలు
ఆల్ట్రోజ్ రూ. 6.49 లక్షలు
నెక్సాన్ రూ. 7.99 లక్షలు
హారియర్ రూ. 14.99 లక్షలు
సఫారీ రూ. 15.49 లక్షలు