For Money

Business News

300 పాయింట్లు అప్‌

దాదాపు అన్ని ప్రధాన షేర్లు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమైంది. కొన్ని నిమిషాల్లోనే 17193ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 306 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అన్ని ప్రధాన సూచీలు రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. అత్యధికంగా రెండున్నర శాతం లాభంతో నిఫ్టి బ్యాంక్‌ ముందుంది. ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలోని 50 షేర్లు, సెన్సెక్స్‌లోని 30 షేర్లు లాభంలో ఉన్నాయి. నిఫ్టిలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 4.77 శాతం లాభంతో టాప్‌లో ఉంది. మెటల్స్‌ కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.