లాభాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు చాలా వరకు నష్టాల నుంచి కోలుకున్నాయి. నాస్డాక్ నష్టాల్లో ముగిసినా… నామ మాత్రమే అనాలి. ఇక డౌజోన్స్ అర శాతం దాకా లాభంతో క్లోజ్ కాగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం లాభంతో ముగిసింది. నిన్న యూరో మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. చాలా వరకు సూచీలు ఒకటిన్నర శాతం నుంచి రెండు శాతం వరకు నష్టంతో ముగిశాయి. ఇక కరెన్సీ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 109.5 వద్ద ఉంటోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ స్థిరంగా ఉన్నాయి. అన్నీ రెడ్‌లో ఉన్నా… నష్టాలు నామమాత్రమే. హాంగ్‌సెంగ్ ఒక్కటే అర శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 45 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది.