హాట్ స్టాక్స్
మార్కెట్లో ఇవాళ రెండు షేర్లు చాలా పాజిటివ్‌గా ఉండే అవకాశముంది. ఇవాళ్టి కోసం సీమెన్స్ కొనుగోలు చేయమని చాలా మంది అనలిస్టులు సూచిస్తున్నారు. షేర్ ధర రూ. 2808 వద్ద ట్రేడవుతోంది. రూ.2900 కాల్ ఆప్షన్ కొనుగోలు చేయాల్సిందిగా ఆషిష్ చతుర్ముఖ సలహా ఇస్తున్నారు. షేర్ ధర రూ.2760 దిగువకు వచ్చే వరకు ఈ పొజిషన్‌ను కొనసాగింవచ్చని ఆయన అంటున్నారు. స్పాట్లో ఈ షేర్ రూ.2950 లేదా రూ. 3000ను క్రాస్ చేసే అవకాశముంది. ఇక రెండో షేర్ ఇండియన్ హోటల్స్. ఈ షేర్ రూ.240ల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. గదుల సరఫరా ఏమాత్రం డిమాండ్‌కు తగ్గట్లు లేవు. ఇండియన్ హోటల్ షేర్ ఏకంగా నష్టాల నుంచి భారీ నికర లాభం ప్రకటించడం వెనుక రహస్యం ఇదే. హోటల్ బిజినెస్ చాలా జోరుగా ఉంది. కొత్త హోటల్స్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేనందున… ఈ షేర్ రూ.300ను దాటే అవకాశముంది.