ఇవాళ నిఫ్టిని కొనండి
ఇవాళ నిఫ్టిని దిగువస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్‌మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని ఇవాళ ఇన్వెస్టర్లకు సూచించారు. గత రెండు రోజుల నుంచి ఆయన మార్కెట్‌కు దూరంగా ఉండాల్సిందిగా ఇన్వెస్టర్లకు సూచించారు.16350 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయాల్సిందిగా ఆయన సలహా ఇచ్చారు. ముఖ్యంగా రిలయన్స్ షేర్‌ను కొనాలని ఆయన చెప్పారు. ఇంకా దీపక్ నైట్రేట్, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ షేర్లను కొనుగోలు చేయాలన్నారు. సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్లో ఆయన మాట్లాడుతూ … స్టాప్‌లాస్ కచ్చితంగా పాటించాలని ఆయన ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. అలాగే మరో అనలిస్ట్ మితేష్ ఠక్కర్ ఇదే ఛానల్లో మాట్లాడుతూ డే ట్రేడింగ్‌కు HDFC లైఫ్, బంధన్ బ్యాంక్‌తో పాటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ను కొనుగోలు చేయొచ్చని సలహా ఇచ్చారు.