టొరెంట్ ఫార్మా చేతికి 4 డాక్టర్ రెడ్డీస్ బ్రాండ్లు
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్కు చెందిన నాలుగు బ్రాండ్లను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకాలు చేసినట్టు టొరెంట్ ఫార్మా ఫ్రకటించింది. ఈ కొనుగోలు విలువ ఎంత అన్నది వెల్లడించలేదు. కొనుగోలు చేయనున్న డాక్టర్ రెడ్డీస్ బ్రాండ్లు స్టిప్టోవిట్-ఇ, ఫినాస్ట్, ఫినాస్ట్-టి, డైనాప్రెస్. వీటిలో స్టిప్టోవిట్-ఇ గైనకాలజీ ఉత్పత్తి కాగా ఫినాస్ట్, ఫినాస్ట్-టి, డైనాప్రెస్ మూడింటినీ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా (బీపీహెచ్) చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఒప్పందం కింద ఆ ఔషధాల తయారీ, మార్కెటింగ్, పంపిణీ అన్నింటినీ టోరెంట్ ఫార్మా తీసుకుంటుంది. జూన్ నాటికి ఈ ఔషధాల బదిలీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. టోరెంట్ ఫార్మా తాజా ఆర్థిక ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగా ఉండటంతో నిన్న కంపెనీ షేర్ పది శాతం లాభంతో ముగిసింది.