For Money

Business News

జింక వచ్చేస్తోంది

ప్రైవేట్‌ ట్రక్‌ ఆపరేటర్లకు సుపరిచితమైన జింక లాజిస్టిక్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 13న ప్రారంభం కానుంది. ఈసంస్థకు చెందిన బ్లాక్‌ బక్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను కూడా ట్రక్‌ ఆపరేటర్లు తరచూ వాడుతుంటారు. బ్లాక్‌బక్‌ మాతృసంస్థ అయిన జింక లాజిస్టిక్‌కు మొత్తం ట్రక్‌ ఆపరేటర్ల మార్కెట్‌లో ఏకంగా 27.52 శాతం వాటా ఉంది. అందుకే ఈ పబ్లిక్‌ ఆఫర్‌ పట్ల మార్కెట్‌లో క్రేజ్‌ ఉంది. ఇష్యూ 13న ప్రారంభమై..18న ముగుస్తుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ. 259- రూ. 273. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా కంపెనీ తాజా షేర్ల జారీ ద్వారా రూ.550 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్ కింద మరో రూ. 565 కోట్లను సమీకరించనుంది. కంపెనీ ప్రమోటర్లతో పాటు ఇతర ఇన్వెస్టర్లు రూ. 565 కోట్ల విలువైన షేర్లను అమ్ముతున్నారు. ఈక్విటీల జారీ ద్వారా సమీకరించే రూ. 550 కోట్లలో రూ. 200 కోట్లు అమ్మకం, సేల్స్‌ మార్కెటింగ్‌ కోసం ఖర్చు పెట్టనున్నారు. అలాగే బ్లాక్‌ బక్‌ ఫిన్‌సర్వ్‌ కంపెనీపై మరో రూ. 140 కోట్లు ఖర్చు చేస్తామని కంపెనీ అంటోంది. గ్రే మార్కెట్‌ అంటే అనధికార మార్కెట్‌లో ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు 25 శాతం ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

Leave a Reply