రూ. 5,603 కోట్ల లాభం
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వేదాంత లిమిటెడ్ రూ. 5,603 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది కంపెనీ ఇదే కాలానికి రూ. 915 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఏకంగా రూ. 9,093 కోట్ల మేర పన్ను చెల్లించాల్సి రావడంతో కంపెనీ భారీ నష్టాన్ని ప్రకటించింది. ఈ ఏడాది పన్ను భారం రూ.2,030 కోట్లకు తగ్గడంతో కంపెని భారీ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గి రూ. 37,634 కోట్లకు చేరింది. ఆదాయం, పన్ను విషయాల్లో కంపెనీ మార్కెట్ అంచనాలను అధిగమించింది. ఎబిటా మార్జిన్ కూడా స్వల్పంగా తగ్గినా.. మార్కెట్ అంచనాల మేరకు ఉంది. సెప్టెంబర్ నెలాఖరున కంపెనీ రుణ మొత్తం 100 కోట్ల డాలర్ల మేరకు తగ్గి రూ. 56,927 కోట్లకు చేరింది.