For Money

Business News

ఇండియన్స్‌కు ట్రంప్‌ భారీ షాక్‌?

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ గెలవగానే భారతీయుల్లో టెన్షన్‌ మొదలైంది. ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన తీసుకోబోయే చర్యలపై అపుడు భారత మీడియాలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. ట్రంప్‌ అధికారం చేపట్టిన తొలిరోజే భారతీయులను తీవ్రంగా దెబ్బతీసే ఉత్తర్వులపై సంతకం చేసే అవకాశముందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. దీనివల్ల అమెరికాలో ఉన్న పది లక్షల మంది భారతీయులపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఇపుడు ఉన్న నిబంధనల ప్రకారం గ్రీన్‌ కార్డ్‌ ఉన్నవారి పిల్లలకు ఆటోమేటిగ్గా అమెరికా పౌరసత్వం లభిస్తోంది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిగా అమెరికా పౌరసత్వం వస్తోంది. అయితే తలిదండ్రులు అమెరికా పౌరులు కాని పక్షంలో వారి పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం ఇచ్చే నిబంధనలను మార్చుతూ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఈ పద్ధతికి స్వస్తి పలుకుతారని టైమ్స్‌ పేర్కొంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారి పిల్లలకు మాత్రం అమెరికా పౌరసత్వం రాదని ఇన్నాళ్ళు భారతీయులు భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే తయారైన నమూనా నిబంధనలను చూస్తే… తలిదండ్రుల్లో ఎవరైనా ఒకరు అంటే తల్లి లేదా తండ్రి అమెరికా పౌరునిగా ఉండాలి. లేదా చట్టబద్ధమైన శాశ్వత పౌరునిగా ఉండాలని నమూనా నిబంధనల్లో పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ఇదే చెబుతోందని అమెరికా అంటోంది. అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిగా అమెరికా పౌరసత్వం రాదని ట్రంప్‌ అంటున్నారని.. అయితే అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు ఇది విరుద్ధమని ఇమిగ్రేషన్‌ అటార్నీ రాజీవ్‌ ఎస్‌ ఖన్నా అన్నట్లు టైమ్స్‌ పేర్కొంది. అయితే ట్రంప్‌ ప్రభుత్వం దీనికి మరో నిర్వచనం ఇవ్వనుంది.

Leave a Reply