For Money

Business News

నికర లాభం పెరిగినా…

జూడియో, వెస్ట్‌సైడ్‌, స్టార్‌ రీటైల్‌ స్టోర్స్‌ నిర్వహించే ట్రెండ్‌ ఇవాళ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 47 శాతం పెరిగి రూ. 335కోట్లకు చేరింది. అయితే ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే 14 శాతం తగ్గింది. అలాగే ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే 39 శాతం పెరిగి రూ. 4157 కోట్లకు చేరిందని కంపెనీ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా అన్నారు. మార్కెట్‌ నిస్తేజంగా ఉన్నా.. కంపెనీ మంచి పనితీరు కనబర్చిందని ఆయన తెలిపారు. కంపెనీ స్టోర్ల సంఖ్యను పెంచడంతో పాటు ఆదాయ మార్గాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని నోయల్‌ టాటా చెప్పారు. మొదటిసారిగా యూఏఈలో ఇంటర్నేషనల్ జుడియో స్టోర్‌ను ప్రారంభించామని, అలాగే భారత్‌లో జూడియో బ్యూటీ కాన్సెప్ట్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి 831 స్టోర్స్‌ ఉన్నాయి. వీటిలో 43 స్టోర్స్‌ గత మూడు నెలల్లో ప్రారంభించారు. వీటిలో 226 వెస్ట్‌సైడ్‌ స్టోర్స్ ఉండగా, 577 జూడియో స్టోర్స్ ఉన్నాయని అన్నారు. మరోవైపు కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటికే భారీగా క్షీణించిన షేర్‌ రేపు ఫలితాలకు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply