నేటి కార్పొరేట్ న్యూస్
Coal India: సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్, మహానది కోల్ ఫీల్డ్స్‌లో 25 శాతం చొప్పున వాటా విక్రయానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఆఫర్ ఫర్ సేల్ కింద ఈ వాటాను అమ్మకాలను నిర్ణయించారు.
HDFC Bank: అతను చక్రవర్తి రాజీనామా వ్యవహారంపై విచారణకు ఒక విదేశీ సంస్థను నియమిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అతను రాజీనామా తరవాత బ్యాంక్ షేర్లలో ఇంకా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.
Capri Global: రైట్స్ ద్వారా రూ. 274 ధరకు 73 లక్షల షేర్లు జారీ చేయాలని కంపెనీ నిర్ణయించింది.
DCX Systems: కొత్తగా రూ. 14 కోట్ల ఆర్డర్
G. R Infraprojects: NHAI నుంచి రూ.2,440 కోట్ల కాంట్రాక్ట్‌కు సంబంధించి LoA అందినట్లు కంపెనీ ప్రకటించింది.
IRB Infra : 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇవ్వాలని ఇప్పటికే కంపెనీ ప్రకటించింది.ఈ బోనస్ పొందడానికి రికార్డు తేదీ ఏప్రిల్ 1గా కంపెనీ ప్రకటించింది.
GOCL Corporation: బెంగళూరులోని 36 ఎకరాల భూమిని మానిటైజేషన్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు Hinduja Realty Venturesతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ డీల్ కింద భూమి, బిల్డింగ్ కలిపి మొత్తం రూ. 2,261 కోట్లు రానున్నాయి.
