For Money

Business News

దారుణంగా దెబ్బ తీసింది

ఫలితాలు బాగా లేని కంపెనీలకు మార్కెట్ తీవ్ర శిక్ష విధిస్తోంది. ఫలితాలు బాగున్న నిన్న భారీగా క్షీణించిన ఎం అండ్ ఎం షేర్‌ ఇవాళ కాస్త పెరిగింది. అయితే టాటా మోటార్స్‌ మరోసారి మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కేవలం రూ. 3,343 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ నికర లాభంతో పోలిస్తే 11.18 శాతం తక్కువైనా… మార్కెట్‌ అంచనాలకు మాత్రం చాలా దూరంగా ఉంది. తాజా త్రైమాసికంలో కంపెనీ రూ. 5,038 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని ఈటీ నౌ ఛానల్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. అయితే ఈ అంచనాలకు ఏమాత్రం పొంతన లేకుండా రూ. 3,343 కోట్లను ప్రకటించడంతో సోమవారం ఈ కౌంటర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి ఖాయంగా కన్పిస్తోంది. కంపెనీ ఆదాయం కూడా అంతంత మాత్రమే పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కేవలం 3.5 శాతం పెరిగి రూ. 101,450 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఎబిటా మార్జిన్‌ కూడా 2.3 శాతం తగ్గి 11.4 శాతానికి చేరింది.

Leave a Reply