For Money

Business News

2 నిమిషాల్లో రూ. 940 కోట్ల లాభం

నిన్న అమెరికా మార్కెట్లలో జరిగిన ఇన్‌సైడర్‌ వల్ల అజ్ఞాత ట్రేడర్‌ కేవలం రెండు నిమిషాల్లో 10 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 940 కోట్ల లాభం పొందారు. నిన్న ఇరాన్‌ యుద్ధం సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేసే ముందు వాల్‌స్ట్రీట్‌లో జరిగిన లావాదేవీలు ఇపుడు అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. నిన్న వాల్‌స్ట్రీట్‌ ప్రారంభానికి రెండు నిమిషాల ముందు ఇటు ఈక్విటీ మార్కెట్‌లోనూ, అటు కమాడిటీ మార్కెట్‌లో భారీ స్థాయిలో లావాదేవీలు జరిగాయి. నిన్న రాత్రి 6.49, 6.51 గంటలకు ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో WTI క్రూడ్‌తో పాటు బ్రెంట్‌లోనూ 7200 కాంట్రాక్ట్‌లను చేతులు మారాయి. వీటి విలువ 76 కోట్ల డాలర్లని డైజోన్స్‌ మార్కెట్‌ డేటాలో స్పష్టంగా ఉందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. అలాగే ట్రంప్‌ ప్రకటన ముందు ఎస్‌ అండ్‌ పీ 500 ఫ్యూచర్స్‌లో 150 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్‌లను కొందరు ట్రేడర్లు కొన్నారు. తగ్గుతుందని ఆయిల్‌ కాంట్రాక్ట్‌లను అమ్మి, పెరుగుతుందని ఎస్‌ అండ్‌ పీ 500 ఫ్యూచర్స్‌ను కొన్నారు. ట్రంప్‌ ప్రకటన తరవాత కేవలం కొన్ని నిమిషాల్లో సదరు ట్రేడర్‌ రూ. 940 కోట్ల లాభం ఆర్జించినట్లు అమెరికన్‌ మీడియా లెక్కగట్టింది. ట్రంప్‌ ప్రకటన తరవతా ఆయిల్‌ 14 శాతం పడగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 2.5 శాతం పెరిగింది. ఇది కేవలం ట్రంప్‌ కోటరీ పనేని చాలా మంది అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ చేయాలని ఇప్పటికే డెమొక్రాట్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు SECగాని, FBI గాని ఎలాంటి ప్రకటన చేయలేదు.

https://x.com/EdConwaySky/status/2036476619980685696?s=20

 

Leave a Reply