For Money

Business News

మళ్ళీ నష్టాల్లో SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న ఆరంభంలో ఒకటిన్నర శాతం లాభఃలో ఉన్న వాల్‌స్ట్రీట్‌ను మైక్రాన్‌ దారుణంగా దెబ్బతీసింది. మరోవైపు టెస్లా కూడా మార్కెట్‌లో దడ పుట్టించింది. నాస్‌డాక్‌ రెండు శాతంపైగా నష్టపోగా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.45 శాతం నష్టపోయింది. ఇక డౌజోన్స్‌ కూడా ఒక శాతంపైగా నష్టంతో ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ 104 ప్రాంతంలోనే కొనసాగుతోంది. అలాగే క్రూడ్‌ కూడా 83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. అయితే చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లలో మాత్రం పెద్ద ఒత్తిడి లేదు. జపాన్‌ నిక్కీ మాత్రం 1.28 శాతం నష్టంతో ఉంది. ఈనేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 100 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి కొత్త వీక్లీ డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ నష్టంతో ప్రారంభం కానున్నాయి.