ఆకట్టుకోని ఫలితాలు
మార్కెట్ చాలా రోజుల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఆ ఫలితాలు రానే వచ్చాయి. ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే ఫలితాల్లో అద్భుతాలు లేకపోవడం, ఓవరాల్‌గా మార్కెట్ మూడ్ బాగా లేకపోవడంతో బ్యాంక్ షేర్ లాభాల్లోకి రాలేకపోయింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.19,782 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంక్ ఆర్జించిన రూ.16,099 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. ఇక స్టాండలోన్ పద్ధతిన చూస్తే నికర లాభం రూ.14,330 కోట్ల నుంచి రూ.18,331 కోట్లకు పెరిగింది. అలాగే బ్యాంక్ నికర ఆదాయం రూ.1.12 లక్షల కోట్ల నుంచి రూ.1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే నిమ్స్ అంటే నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగి రూ.41,620 కోట్లకు చేరినట్లు బ్యాంక్ వెల్లడించింది. నిరర్థక ఆస్తుల కోసం కేటాయించిన మొత్తం రూ.1814 కోట్ల నుంచి రూ.3631 కోట్లకు పెరిగ్గా. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.21 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఫలితాలు వెలువడిన తరవాత కూడా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ షేర్ 2 శాతం నష్టంతో రూ.842 వద్ద ట్రేడవుతోంది.