వైజాగ్ స్టీల్‌కు రూ.1640 కోట్లు విడుదల
వైజాగ్ స్టీల్ మూతపడకుండా ఉండేందుకు ఇప్పటికే రూ.1640 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొంత మొత్తం రుణాల చెల్లింపునకు రూ. 1140 కోట్లు, మరో రూ. 500 కోట్లు కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ కింద సమకూర్చినట్లు స్టీల్ శాఖకు చెందిన అధికారి ఒకరు ద హిందూ బిజినెస్‌లైన్ పత్రికకు వెల్లడించారు. బ్యాంకులకు వైజాగ్ స్టీల్ రూ. 18000 కోట్ల బకాయి ఉంది. డిసెంబర్ నెల వరకు నిధులను అందిస్తూ ఉంటాయని స్టీల్ అధికారి తెలిపారు. కంపెనీ పునరుద్ధరణ కోసం ఎస్‌బీఐ క్యాప్స్ ఒక నివేదిక తయారు చేస్తోంది. ఈ నివేదిక నెలాఖరులోగా అందనుంది. వైజాగ్ మాతృ సంస్థ ఆర్‌ఐఎన్‌ఎల్‌కు యూపీలోని రాయ్‌బరేలీలో ఒక ప్లాంట్ ఉంది. దీన్ని రూ. 2,250 కోట్లకు రైల్వేలకు విక్రయించారు. ఇందులో రూ. 800 నుంచి రూ. 900 కోట్లు నగదు రూపేణా అందగా మరో రూ. 1,000 కోట్లను రుణాల కింద చెల్లించారు.