For Money

Business News

21% డౌన్‌: ఈ షేరుకు ఏమైంది?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొన్ని సంవత్సతరాల నుంచి ఇన్వెస్టర్లను సతాయిస్తోంది. న్యూఏజ్‌ షేర్లు భారీ లాభాలను అందిస్తుండగా, రిలయన్స్‌ రోజు రోజుకీ బలహీనపడుతోంది. ముఖ్యంగా అదానీ గ్రూప్‌ షేర్లు ఇన్వెస్టర్లకు ఇచ్చిన సంపదతో పోలిస్తే… రిలయన్స్‌ కంపెనీ ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. స్టాక్‌ విభజన తరవాత కూడా ఆ కౌంటర్‌లో ఉత్సాహం లేదు. ఈ ఏడాది గరిష్ఠ స్థాయి నుంచి రిలయన్స్‌ షేర్‌ ఏకంగా 21 శాతం నష్టపోయినా… ఎక్కడా మద్దతు అందడం లేదు. ఒక్క రిలయన్స్‌ జియో మినహా మిగిలిన విభాగాల పనితీరు అంతంత మాత్రమే ఉంది. రీటైల్‌పై ఇంకా పెట్టుబడి పెడుతూనే ఉన్నారు. న్యూఏజ్‌ సెక్టార్‌ అయిన రెన్యూవబుల్‌ ఎనర్జి రంగంలో రిలయన్స్‌ పెద్దగా సాధించింది లేదు. ఈ నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్న వార్తలతో టెలికాం రంగంలోనే గందరగోళం ఏర్పడింది. ట్రంప్‌ కచ్చితంగా ఒత్తిడి తెస్తారని, స్టార్‌ లింక్‌ కార్యకలాపాలు వచ్చే ఏడాది నుంచి ఊపందుకుంటాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పెట్టుబడికి ఇన్వెస్టర్లు జంకుతున్నారు. ఈ ఏడాది జులై 8వ తేదీన రిలయన్స్ షేర్‌ రూ.1608ని తాకింది. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో క్లోజింగ్‌ ధర రూ. 1269. అంటే 21 శాతం పైగా పడిందన్నమాట. ఈ షేర్‌కు దిగువ స్థాయిలో అంటే రూ. 1200 లేదా రూ. 1187 లేదా రూ. 1170 ప్రాంతంలో మద్దతు లభించే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు. ఒకవేళ మద్దతు అందినా.. 1295 వద్ద ప్రతిఘటన వస్తుందని అంటున్నారు.ఈ స్థాయిని దాటితో రూ. 1330, లేదా రూ. 1352 వద్ద ఒత్తిడి ఖాయమని అంటున్నారు. కొత్త ఇన్వెస్టర్లు ఎవరూ రిలయన్స్‌ వంటి సంప్రదాయ పాత షేర్ల జోలికి వెళ్ళడం లేదు. దీంతో ఇతర ఇన్వెస్టర్లకు కూడా ఈ కౌంటర్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.

Leave a Reply