For Money

Business News

సిప్‌ నిధుల వెల్లువ

మన స్టాక్‌ మార్కెట్లపై మన ఇన్వెస్టర్లకు ఉన్న మక్కువ నిదర్శనం సిప్‌ నిధులు. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) నిధులు వెల్లువలా మ్యూచువల్ ఫండ్‌లకు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా అక్టోబర్‌ నెలలో స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. ముఖ్యంగా మిడ్ క్యాప్‌ షేర్లు కొన్ని ఇన్వెస్టర్ల నష్టాలు భారీగా ఉన్నాయి. అయినా మార్కెట్‌పై ఎనలేని విశ్వాసం ఉన్న ఇన్వెస్టర్లు సిప్‌ ద్వారా పెట్టుబడులను పెంచారు. అక్టోబర్‌ నెలలో రూ.25,323 కోట్లు ఇన్వెస్టర్లు సిప్‌ ద్వారా పెట్టుబడి పెట్టినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) వెల్లడించింది. సెప్టెంబర్‌ నెలలో ఈ సిప్‌ల మొత్తం రూ.24,509 కోట్లు. గత ఏడాదితో అక్టోబర్‌ నెలలో సిప్‌ ద్వారా ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడి రూ.16,928 కోట్లుని యాంఫీ పేర్కొంది. సిప్‌ కింద వివిధ మ్యూచువల్ ఫండ్స్‌ వద్ద ఉన్న నిధుల మొత్తం 13.30 క్షల కోట్లకు చేరినట్లు యాంఫి వెల్లడించింది.

Leave a Reply