For Money

Business News

మాస్టర్‌కార్డ్‌పై ఆంక్షలు ఎత్తివేత

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల నెట్‌వర్కింగ్‌ సంస్థ మాస్టర్‌ కార్డ్‌పై ఆంక్షలను ఆర్‌బీఐ తొలగించింది. లోకల్‌ డాటా స్టోరేజ్‌ నిబంధనల్ని పాటించడం లేదన్న ఆరోపణలపై కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా గత ఏడాది మాస్టర్‌ కార్డ్‌పై ఆర్బీఐ నిషేధం విధించింది. పేమెంట్‌ సిస్టమ్‌ డాటా నిబంధనల పాటించే విషయంలో సంతృప్తికర చర్యలు తీసుకున్నందున మాస్టర్‌కార్డ్‌ ఆసియా/పసిఫిక్‌పై నియంత్రణల్ని ఎత్తివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. గతేడాది జులై 14న ఈ సంస్థపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం డెబిట్‌, క్రెడిట్‌ డేటాతో పాటు కస్టమర్ల డేటా భారత్‌లోని సర్వర్లలోనే ఉంచాల్సి ఉంటుంది.