For Money

Business News

బ్రెజిల్‌: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు బ్రేక్‌

బ్రెజిల్‌ కొత్త అధ్యక్షుడిగా లులా పదవీ స్వీకారం చేసిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో బల్సొనారోను లులా ఓడించిన విషయం తెలిసిందే. మూడోసారి అధ్యక్షుడిగా నిన్న పదవీ ప్రమాణం చేశారు. ఇవాళ ప్రభుత్వ అధికారులతో వరుస భేటీలు నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేదరిక నిర్మూల పథకాలకు అగ్రస్థానం కల్పించారు. అలాగే విద్యకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడిస్తారు. గత ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు చర్యలు తీసుకుంది. వాటన్నింటిని రద్దు చేస్తూ లులా ప్రకటించారు. వీటిల్లో ప్రభుత్వ రంగ చమురు కంపెనీ పెట్రోబ్రాస్‌, పోస్టాఫీస్‌ సంస్థ, ప్రభుత్వ రంగ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీల ప్రైవేటీకరణను ఆపేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేశారు.