For Money

Business News

ఏఐ ఎఫెక్ట్‌: 30వేల ఉద్యోగాలు ఔట్‌

ఒరాకిల్‌ కంపెనీ నిన్న ఒక్కసారిగా 30 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో ఉద్యోగులకు ఈమెయిల్‌ పంపింది. వీరిలో 12 వేల మంది మనదేశంలో పని చేస్తున్న ఉద్యోగులు కావడం గమనార్హం. కంపెనీలో 1.62 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 18 శాతం మందికి ఉద్వాసన పలికారు. మేనేజింగ్‌ హోదాల్లో ఉన్న వాళ్లే ఎక్కువ మంది వేటుకు గురైట్లు తెలుస్తోంది. ఏఐతో పాటు డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు పెట్టాల్సిన నేపథ్యంలో కంపెనీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. పలు విభాగాల్లో ఏఐ రావడంతో ఇక వారి అవసరం లేదని కంపెనీ తొలగించింది. అలాగే డేటా సెంటర్లపై భారీ స్థాయిలో పెట్టబుడి పెట్టాల్సి ఉన్నందున… క్యాపిటల్‌ ప్రయారిటీ మార్చినట్లు పేర్కొంది. త్వరలోనే మరో విడత కోతలు ఉంటాయని కూడా కంపెనీ వర్గాలు అంటున్నాయి. ఏఐ వచ్చిన తరవాత ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. అయితే ఒకే
సారి ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి.

Leave a Reply