ఆల్ టైమ్ కనిష్ఠస్థాయికి…
80 రోజుల్లో సగానికి షేర్ ధర పడింది. ఈ ఏడాది ఆగస్టు 20న రూ. 157.40ని తాకిన ఒలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ ఇవాళ రూ. 72.60ని తాకింది. ఇది ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి. క్లోజింగ్‌లో కాస్త పెరిగి రూ. 72.67 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసిన తరవాత కంపెనీ ఫలితాలు వచ్చాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరనష్టం గత ఏడాదితో పోలిస్తే తగ్గినా… గత త్రైమాసికంతో పోలిస్తే పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఒలా కంపెనీ రూ. 524 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించగా, తాజా త్రైమాసికంలో రూ. 495 కోట్ల నికర నష్టాన్ని వెల్లడించింది. నిజానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 347 కోట్లు మాత్రమే. తాజా త్రైమాసికంలో కంపెనీ రూ. 1214 కోట్ల అమ్మకాలను సాధించింది. గత ఏడాది అమ్మకాలు రూ. 873 కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగాయి. నష్టాలు వచ్చినా గ్రాస్ మార్జిన్ మాత్రం 20.3 శాతం ఉండటం విశేషం. గడచిన మూడు నెలల్లో 98,619 బైక్స్‌ను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇపుడు దేశ వ్యాప్తంగా కంపెనీ సొంత స్టోర్స్ 782 దాకా ఉన్నాయని, 2025కల్లా వీటిని 2000లకు పెంచుతామని పేర్కొంది.