For Money

Business News

మరో మెగా ఐపీఓ రెడీ

ఒకవైపు ఇవాళ స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా… ఎన్‌టీపీసీ (NTPC) షేర్‌ లాభాల్లో ముగిసింది. దీనికి కారణం ఈ సంస్థ అనుబంధా కంపెనీ అయిన ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూ వివరాలు వెల్లడి కావడమే. ప్రైమరీ మార్కెట్‌ నుంచి రూ.10,000 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఐపీఓఈనెల 19న ప్రారంభమై.. 22న ముగుస్తుంది. ధరల రేంజ్‌ను రూ.102- రూ.108గా కంపెనీ నిర్ణయించింది. కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేయాలని. ఒక లాట్‌లో 138 షేర్లు ఉంటాయి. గరిష్ఠ ధరతో దరఖాస్తు చేయాలంటే రీటైల్‌ ఇన్వెస్టర్లు ఒక్కో లాట్‌కు రూ.14,904 కట్టాల్సి ఉంటుంది. అలాగే వీరు గరిష్ఠంగా 13 లాట్లను దరఖాస్తు చేయొచ్చు. ఇటీవల వచ్చిన పెద్ద మెగా పబ్లిక్‌ ఇష్యూల్లో ఇదొకటిగా చెప్పొచ్చు. ఈ మధ్యే హ్యుండాయ్‌ మోటార్స్‌ ఇండియా, స్విగ్గీల నుంచి భారీ ఐపీఓలు వచ్చిన విషయం తెలిసిందే. పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభానికి ఒక రోజు ముందే యాంకర్‌ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ఎన్‌టీపీసీ మొత్తం కొత్త షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓలో ప్రధాన ప్లస్‌ పాయింట్‌ ఇది. రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌లో 10 శాతం రిజర్వ్‌ చేశారు. రెన్యూవబుల్‌ ఎనర్జి రంగంలో ఎన్‌టీపీసీ గ్రీన్‌ అతి పెద్ద కంపెనీగా చెప్పొచ్చు. కంపెనీ ఇప్పటికే ప్రారంభించిన, ప్రారంభించనున్న కెపాసిటీ కలిపితే 20 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఎన్‌టీపీసీ గ్రీన్‌ రెడీ అవుతోంది. ఈ ఆఫర్‌ నిధులు తమ విస్తరణకు చాలా అవసరమని ఎన్‌టీపీసీ గ్రీన్‌ అంటోంది. చాలా బ్రోకరేజీ సంస్థలు ఈ ఆఫర్‌కు చాలా పాజిటివ్‌గా ఉన్నారు.

Leave a Reply