For Money

Business News

స్విగ్గీ లిస్టింగ్‌ కూడా అంతేనా?

మార్కెట్‌ నుంచి రూ. 11327 కోట్లు సమీకరించిన స్విగ్గీ ఐపీఓ ఏకంగా 3.59 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. రీటైల్‌ విభాగం సబ్‌స్క్రిప్షన్‌ విభాగం అంతంత మాత్రమే ఆదరణ పొందింది. అక్టోబర్‌లో మార్కెట్ పతనం ప్రభావం ఈ ఐపీఓపై తీవ్రంగా ఉంది. షేర్లను రూ. 390లకు కేటాయించడం కూడా ఈ ఆఫర్‌కు ఓ పెద్ద మైనస్‌. నష్టాల్లో ఉన్న కంపెనీకి ప్రీమియం భారీగా నిర్ణయించారని చాలా మంది అనలిస్టులు అన్నారు. దీంతో ఓపెన్‌ ఆఫర్‌ సమయంలో ఉన్న రూ. 25 ప్రీమియం కూడా రాన్రాను కరిగిపోయింది. బుధవారం అంటే  లిస్టింగ్‌ రోజు పెద్ద ప్రీమియం ఉండకపోవచ్చని… మార్కెట్ నెగిటివ్‌ ట్రెండ్‌లో ఉంటే డిస్కౌంట్‌కు కూడా లిస్ట్‌ కావొచ్చని కొందరు అనలిస్టులు అంటున్నారు. హుంద్యాయ్‌ వంటి ఇష్యూ ఇదే పరిస్థితి ఎదురైంది. మరి స్విగ్గీకి దిగువస్థాయిలో ఆదరణ లభిస్తుందా లేదా అన్నది చూడాలి.

Leave a Reply