For Money

Business News

కాల్పుల విరమణకు ఇరాన్‌ నో

హుర్ముజ్‌ జలసంధిని ఓపెన్‌ చేస్తే 45 రోజుల పాటు యుద్ధ విరమణ చేస్తామంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్‌ తిరస్కరించింది. బదులుగా ఇరాన్‌ కొన్ని ప్రతిపాదనలు పంపింది. యుద్ధ విరమణ చేయాలంటే శాశ్వత కాల్పుల విరమణ ఉండాలని పేర్కొంది. తమ దేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేసింది. అలాగే యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంటుందని, హర్ముజ్‌ జలసంధి నిర్వహణకు కొత్త ఒప్పందం ఉండాలని ఇరాన్‌ స్పష్టం చేసింది. గల్ఫ్‌ ప్రాంతంలో అన్ని రకాల విభేదాల నివారణ జరగాలని, అలాగే భవిష్యత్తులో లెబనాన్ మిలిటరీ హెబ్బొల్లాపై ఇజ్రాయిల్‌ తెగబడకూడని స్పష్టం చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాషింగ్టన్‌లో మాట్లాడుతూ… ఇరాన్‌ ప్రతిపాదనలను తోసిపుచ్చారు. అయితే ఇరాన్‌ నుంచి ప్రతిపాదనలు రావడంలో గొప్ప పరిణామమని అన్నారు. మరోవైపు అమెరికా 45 రోజుల కాల్పులు విరమణ ప్రతిపాదన వెనుక దురుద్దేశం ఉందని, ఈలోగా ఆయుధాలు సమకూర్చుకుని మళ్ళీ అమెరికా విరుచుకుపడుతుందని ఇరాన్‌ ప్రతినిధులు అన్నారు.

Leave a Reply