For Money

Business News

పడిన షేర్లే గతి…

మార్కెట్‌ ఇవాళ కూడా డైరెక్షన్‌ లేకుండా నడుస్తోంది. కేవలం ఫలితాలు మినహా మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ఏవీ లేవు. దీంతో ఇటీవల భారీగా క్షీణించిన షేర్లు లాభాల్లోకి వచ్చిన మార్కెట్‌ను ఆదుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లు దూసుకుపోతున్నా… ట్రంప్‌ ఆంక్షల భయం మన మార్కెట్‌కు పట్టుకుంది. అమెరికా మార్కెట్‌తో సంబంధాలు ఉన్న పలు కంపెనీ షేర్లలో ట్రేడింగ్‌ డల్‌గా మారింది. పైగా డాలర్‌ భారీగా పెరగడంతో… క్రూడ్‌ ధరలు క్షీణించినా.. మన మార్కెట్‌కు పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. ఫలితాలు బాగా లేని కంపెనీల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తుండగా, లాభాల్లో చక్కగా ఉన్న కంపెనీల షేర్లలో లాభాలు స్వీకరిస్తున్నారు. ఇవాళ నిఫ్టి స్వల్ప లాభాల్లో 24చ167 వద్ద ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌ షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అలాగే బ్యాంక్‌ షేర్లు. బ్యాంక్‌ నిఫ్టి పటిష్ఠంగా ఉండటంతో నిఫ్టి బతికిపోతోంది. ఇవాళ నిఫ్టి షేర్లలో ట్రెంట్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో బ్రిటానియా టాప్‌లో ఉంది. ఇంకా బీఈఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌ ఉన్నాయి.

Leave a Reply