నిఫ్టి@ 24,000
అమెరికా, ఇరాన్ దేశాల కాల్పుల విరమణతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. మన మార్కెట్లు కూడా దుమ్ము రేపాయి. చాన్నాళ్ళ డల్‌నెస్ తరవాత నిఫ్ఠి పరుగులు పెట్టటింది. సెషన్ మధ్యలో 24000 పాయింట్లను క్రాస్ చేసిన నిఫ్టి.. తరవాత స్వల్పంగా తగ్గినా క్లోజింగ్‌కల్లా 24000 స్థాయికి వచ్చేసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 873 పాయింట్ల లాభంతో 23997 వద్ద ముగిసింది. ఇవాళ బ్యాంక్, ఎన్బీఎఫ్సీలు షేర్లు బాగా రాణించాయి. ఈ రెండు సూచీలు అయిదు శాతం మించి లాభపడ్డాయి. ఇక ఆటో షేర్లు కూడా టాప్ గేర్‌లో ట్రేడవుతున్నాయి. ఇవాళ 3370 షేర్లు ట్రేడవగా, 2960 షేర్లు లాభాల్లో, 341 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి గెయినర్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్ టాప్‌లో నిలిచింది. ఈ షేర్ ఇవాళ పది శాతంపైగా పెరిగింది. అలాగే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్, ఐషర్ మోటార్స్, ఇండిగో షేర్లు టాప్ గెయినర్స్‌లో ముందున్నాయి. ఇక నష్టపోయినవాటిలో కోల్ ఇండియా ఉంది. ఈ షేర్మూడు శాతం నష్టపోయింది. మిగిలిన నిఫ్టి షేర్లు నామమాత్రపు నష్టాలతో ముగిశాయి. గల్ఫ్ యుద్ధం కారణంగా భారీగా క్షీణించిన రియాల్టి షేర్లు ఇవాళ జోష్‌తో ట్రేడయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన షేర్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఫోర్స్ మోటార్స్, పీఎన్బీ హౌసింగ్, భారత్ ఫోర్జ్, ఏంజిల్ వన్‌తో పాటు ఎటర్నల్ షేర్లను కొనుగోలు చేయాల్సిందిగా చాలా మంది అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు.
