For Money

Business News

మళ్ళీ డేజంర్‌ జోన్‌లో 23,300

మార్కెట్‌ గిఫ్ట్‌ నిఫ్టి సూచించిన దానికన్నా అధిక నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 23025 పాయింట్లను స్థాయిని తాకింది.ఇపుడు 270 పాయింట్ల నష్టంతో 23,250 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులు వద్ద నిఫ్టికి 23000 ప్రాంతంలో మద్దతు అందినా… నిలబడలేకపోతోంది. ఎంత జోరుగా పెరిగితే… డబుల్‌ ఒత్తిడితో కిందికి వచ్చేస్తోంది. ట్రంప్‌ విధానాల్లోఅయోమయంతో ఇన్వెస్టర్లు కూడా ఎలాంటి పొజిషన్స్‌ తీసుకోలేకపోతున్నారు. కేవలం విదేశీ ఇన్వెస్టర్లు మాత్రమే రాణిస్తున్నారు. సూచీల్లో దాదాపు 86 శాతం షార్ట్‌ పొజిషన్స్‌తో మార్కెట్‌ను శాసిస్తున్నారు. ఇరాన్‌ నుంచి తాము క్రూడ్‌ కొనలేదన్న రిలయన్ష్‌ వార్తతో ఆ కంపెనీ షేర్‌ ఒకటిన్నర శాతం నష్టపోయింది. అలాగే పాలసీ బజార్‌కు చెందిన అనుబంధ కంపెనీపై బినామీ ఆస్తుల చట్టం ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ షేర్‌ కూడా 5 శాంపైగా తగ్గింది. సోలిహల్‌ ప్లాంట్‌లో జేఎల్‌ఆర్‌ ఉత్పత్తిని ఆపినట్లు కంపెనీ పేర్కొంది. ఈ షేర్‌ రెండు శాతం నష్టంతో ఉంది. నిఫ్టిలో ఐటీ షేర్లు మాత్రమే గ్రీన్లో ఉన్నాయి. టాప్‌ గెయినర్‌గా ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ట్రెంట్‌ ఉన్నాయి. ఇక నిఫ్టి లూజర్స్‌లో శ్రీరామ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ పీవీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు ఉన్నాయి.

Leave a Reply