300 పాయింట్లకు పైగా లాభం
నిఫ్టి ఇవాళ పటిష్టంగా ట్రేడవుతోంది. మార్కెట్ ఆరంభంలో వచ్చే వీక్లీ డెరివేటివ్స్ ఒత్తిడిని మార్కెట్ తట్టుకుంది. ఇక చివర్లో వచ్చే ఒత్తిడిని నిఫ్టి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నిఫ్టి 50లో 48 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ మాత్రం నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్ నిలిచింది. దిగువస్థాయిలో ఈ షేర్‌కు గట్టి మద్దతు లభించింది. అలాగే ఆటో మొబైల్ షేర్లకు కూడా డిమాండ్ ఉంది. 10వేల ఈవీ బస్సుల కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో ఒలెక్ట్రా, జేబీఎంతో పాటు టాటా మోటార్స్ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. ఐషర్ మోటార్స్, ఎటర్నల్, ఇండిగో, ఏషియన్ పెయింట్స్ షేర్లు నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ముందున్నాయి. హిటాచి ఎనర్జి కూడా ఇవాళ గ్రీన్‌లో ఉంది.
