మార్కెట్లకు ట్రంప్ జోష్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కన్పిస్తోంది. ట్రంప్ విజయం సునాయాసం కావడంతో మార్కెట్లలో స్పష్టత వచ్చింది. వాల్‌స్ట్రీట్ రాత్రి ఒక శాతంపైగా లాభపడగా, ఫ్యూచర్స్ అంతకన్నా భారీ లాభాల్లో ఉన్నాయి. ఉదయం నుంచి ఇదే ట్రెండ్ ప్రపంచ మార్కెట్లలో కన్పిస్తోంది. అధ్యక్ష ఎన్నికలపై ఉన్న సందిగ్ధత తొలగిపోవడంతో మన మార్కెట్లు కూడా ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఆరంభంలో నష్టాల్లోకి జారుకున్నా… నిఫ్టి వెంటనే కోలుకుని వంద పాయింట్లకు పైగా లాభంతో ఉంది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ట్రెంట్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ జాబితాలో ఇంకా బీఈఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి టాప్ షేర్లలో టైటాన్, టాటా స్టీల్, ఎస్‌బీఐ లైఫ్, హిందాల్కో, కర్ణాటక బ్యాంక్ ఉన్నాయి.