కీలక స్థానాలపైనే…
ఉదయం నుంచి నిఫ్టి బలంగా ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఉదయం 23517 పాయింట్లను తాకిన నిఫ్టి వెంటనే పుంజుకుంది. ఇపుడు 221 పాయింట్ల లాభంతో 23675 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ కూడా 791 పాయింట్ల లాభంతో ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్ల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలో ర్యాలీ కన్పిస్తోంది. అలాగే బ్యాంక్ షేర్లలో ఆసక్తి కన్పిస్తోంది. నిఫ్టిలో ఏకంగా 44 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ట్రెండ్ రికార్డు స్థాయిలో 3 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నష్టాల్లోఉన్న షేర్లు కూడా నామమాత్రపు నష్టాల్లో ఉన్నాయి.