22,900ని టచ్ చేసిన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 22900 పాయింట్లను తాకింది.ఇపుడు 552 పాయింట్ల లాభంతో 22884 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అనేక కీలక సూచీలు రెండు నుంచి మూడు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి ఫైనాన్స్ సూచీలు మూడు శాతం లాభంతో ఉన్నాయి. ఇపుడు మొత్తం 2730 షేర్లు ట్రేడవగా, 2594 షేర్లు గ్రీన్‌లో, 91 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలోని మొత్తం 50 షేర్లు గ్రీన్‌లో ఉండటం విశేషం. 7 శాతం లాభంతో ట్రెంట్ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. తరువాతి స్థానాల్లో బీఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్ ఉన్నాయి.
