For Money

Business News

డేంజర్‌ జోన్‌లో 24,000

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యం, చైనా నుంచి ఉద్దీపన ప్యాకేజీ… భారత మార్కెట్‌లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా చైనా ఎన్‌పీసీ సమావేశం చాలా కీలకం కానుంది. ఉద్దీపన ప్యాకేజీని ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. సమావేశం శుక్రవారం వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 24000ను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఉదయం 24056 పాయింట్ల స్థాయిని తాకింది. ఇపుడు 24085 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 232 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ కూడా 732 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ బజాజ్‌ ఆటో 4.4 శాతం నష్టపోయి రూ.10000 దిగువకు వచ్చేసింది. అలాగే సన్‌ ఫార్మా కూడా మూడున్నర శాతం నష్టపోవడం విశేషం. ఇక బజాజ్‌తో పాటు హీరో హోండా కూడా నష్టపోయింది. ఈ షేర్‌ మూడు శాతం దాకా తగ్గింది. ఇక బీపీసీఎల్‌, రిలయన్స్‌ షేర్లు కూడా టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం 2.8 శాతం లాభంతో నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టెక్‌ మహీంద్రా, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ 5లో ఉన్నాయి.