షార్ట్ కవరింగ్?
మిడ్‌సెషన్ తరవాత మార్కెట్లో అనూహ్య రీతిలో నిఫ్టి లాభాలు పొందింది. మరి ఈ లాభాలు షార్ట్ కవరింగ్ వల్ల వచ్చాయా? లేదా కొత్తగా కొనుగోళ్ళు వచ్చాయా అన్నది డేటా చెప్పాలి. అయితే అనేక షేర్లలో ఇవాళ దిగువస్థాయిలో ఆసక్తి కన్పించింది. ఇవాళ ఫైనాన్షియల్ నిఫ్టి క్లోజింగ్. 24000 వీక్లీ కాంట్రాక్ట్ ధర ఇవాళ ఉదయం రూ. 1.25 ఉండగా, ఒకదశలో రూ.143ని దాటింది. దీన్ని బట్టి మార్కెట్‌లో వచ్చిన రికవరీ ఎంత పవర్‌ఫుల్ ర్యాలీని అర్థమౌతుంది. అయితే రేపు బ్యాంక్ నిఫ్టి, ఎల్లుండి నిఫ్టి డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. మరి దీనికి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందేమో చూడాలి. అయితే ఇవాళ రాత్రికి జరిగే అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన ఫలితాలు రేపు ట్రేడింగ్ సమయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోటీ నువ్వా నేనా అన్న రీతిలో ఉంటే మినహా… లేకుంటే ట్రెండ్ అర్థమౌపోతుంది. వీటన్నింటి కారణంగా మార్కెట్‌కు ఇవాళ దిగువస్థాయిలో మద్దదు లభించింది. నిఫ్టి ఇవాళ 23842ను తాకింది. అక్కడి నుంచి కోలుకుని రూ. 24229 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అంటే కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు 400 పాయింట్ల ర్యాలీ వచ్చిందన్నమాట. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 217 పాయింట్ల లాభంతో 24213 వద్ద ముగిసింది. అదే సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడింది. ఇవాళ మెటల్ కౌంటర్లలో మంచి రికవరీ కన్పించింది. చైనా ఆర్థిక గణాంకాలు బాగుండటం కూడా దీనికి ఒక కారణం. నిఫ్టి టాప్5లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కోలు ఉన్నాయి. తరవాతి స్థానంలో బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఇక నిఫ్టి టాప్ లూజర్స్‌లో ట్రెంట్ టాప్‌లోఉంది. ఈ షేర్ ఇవాళ రూ. 6943ని తాకింది. అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది దాదాపు ఇదే సమయంలో రూ.2,191 ఉన్న ట్రెండ్ షేర్ అక్టోబర్ 14న రూ.8348కి చేరింది. అక్కడి నుంచి రూ. నెలకూడా తిరక్కనే రూ. 1595 తగ్గిందన్నమాట. మొత్తం ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. మరి రికవరీలో ఈ షేర్ ముందుంటుందా? అన్నది చూడాలి.