For Money

Business News

పాకిస్తాన్ మధ్యవర్తిత్వం?

ఇరాన్‌, అమెరికా యుద్ధం సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకున్నా… కేవలం మీడియా కథనాల ఆధారంగా మార్కెట్లు స్పందిస్తున్నాయి. పాకిస్తాన్‌ ద్వారా ఇరాన్‌ నేతలకు 15 అంశాల ప్రతిపాదిన అమెరికా పంపినట్లు న్యూయార్స్‌ టైమ్స్‌ వెల్లడించింది. అయితే ఇందులో ప్రతిపాదించిన అన్ని అంశాలు పాతవేనని మీడియా అంటోంది. మధ్యవర్తిత్వానికి తాము రెడీ అంటూ పాకిస్తాన్‌ పీఎం పెట్టిన ఎక్స్‌ పోస్ట్‌ను ట్రంప్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ సోషల్ ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం లేదు. మరోవైపు ఇరాన్‌ మాత్రం చర్చలు జరగడం లేదని అంటోంది. ఇజ్రాయిల్‌ అధికారుల ప్రకటనలు కూడా వస్తున్నాయి.

Leave a Reply