For Money

Business News

నేను మళ్ళీ వచ్చేశానోచ్‌…

తన ప్రసంగాలతో మోడీ పరివార్‌ను గడగడ లాడించి… గత లోక్‌సభ నుంచి సస్పెండ్‌కు గురైన ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ మహువా మొయిత్రా మళ్ళీ లోక్‌సభకు వచ్చేశారు. ఇవాళ ఆమె పార్లమెంటు సెక్రటేరియట్‌ నుంచి ఐడీ కార్డు తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ నుంచి తృణమూల్‌ టికెట్‌పై ఆమె ఎంపీగా మళ్ళీ ఎంపికయ్యారు. బీజేపీకి చెందిన అమృత రాయ్‌ను ఆమె 56 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. గత లోక్‌సభలో ఆమె ఇదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. అయితే తన ఈమెయిల్‌ ఐడిని దుర్వినియోగం చేశారంటూ లోక్‌సభ నుంచి ఆమె సస్పెండ్‌ చేశారు. ఈ మెయిల్‌ వ్యవహారాన్ని పరిశీలించి…మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేయాలని ప్రతిపాదించిన ఎథిక్స్‌ కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ శాంకర్‌ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం వివేశం. యూపీలోని కౌశాంబి సీటు నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన వినోద్‌… సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.