ఫలితాలు అదుర్స్…
మార్కెట్లో ఫార్మా కంపెనీలకు ఎదురు లేకుండా పోతోంది. ఒక్కో కంపెనీ పోటీ పడి అద్భుత ఫలితాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా లుపిన్ కంపెనీ మార్కెట్ అంచనాలకు మించిన ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 5672 కోట్ల ఆదాయంపై రూ. 852 కోట్ల నికర లాభం ఆర్జించింది. సీఎన్‌బీసీ టీవీ18 సర్వేలో పాల్గొన్న మార్కెట్ అనలిస్టులు కంపెనీ రూ. 5564 కోట్ల ఆదాయంపై రూ. 746 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. అంచనాలను మించి ఫలితాలను సాధించడంతో రేపు ఈ షేర్ వెలుగులో ఉండే అవకాశముంది. కంపెనీ ఎబిటా కూడా రూ. 1340 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ 23.6 శాతం మార్జిన్ ప్రకటించడం కూడా విశేషం.