For Money

Business News

దరఖాస్తు చేయడం అవసరమా?

గ్రే మార్కెట్ అంటే అనధికార మార్కెట్‌లో స్విగ్గీ షేర్‌కు ప్రీమియం రెండు శాతం కూడా లేదు. పట్టుమని పది రూపాయాలు కూడా వస్తాయన్న ఆశలేదని అంటున్నారు. మరి ఈ ఇష్యూకు దరఖాస్తు చేయడం అవసరమా? ఇదే డౌన్‌ ట్రెండ్‌ కొనసాగుతుంటే… లిస్టింగ్ సమయానికి అధిక డిస్కౌంట్‌కు ఈ షేర్‌ లభిస్తుందేమో. మొత్తానికి ఐపీఓ రెండో రోజు నాటికి రీటైల్‌ ఇన్వెస్టర్లు పరవాలేదనిపించారు. ఇతర కేటగిరీలో బహుశా రేపు దరఖాస్తు చేయొచ్చు. అన్ని కేటగిరీలు కలిపితే స్విగ్గీ ఐపీఓ రెండోరోజు నాటికి 35 శాతం సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. మొత్తం 16 కోట్ల షేర్లకు గానూ 5.56 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. రీటైల్‌ పోర్షన్‌ 84 శాతం సబ్‌స్క్రిప్షన్‌ పొందగా.. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల (QIB) కోటా 28 శాతం, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కోటా 14 శాతం చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. ఈ ఆఫర్‌ ధరల శ్రేణిని రూ.371-390. అతి కష్టం మీద రూ. 400 వద్ద ఈ షేర్‌ లిస్ట్‌ కావొచ్చని అనలిస్టులు అంచనా.

Leave a Reply